సింగరేణి బొగ్గుగని ప్రమాద ఘటనపై మంత్రి కొప్పుల తీవ్ర దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2021-11-11T00:42:35+05:30 IST

సింగరేణి బొగ్గు గనిలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడం పట్ల మంత్రి కొప్పులఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

సింగరేణి బొగ్గుగని ప్రమాద ఘటనపై మంత్రి కొప్పుల తీవ్ర దిగ్ర్భాంతి

కరీంనగర్: సింగరేణి బొగ్గు గనిలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడం పట్ల మంత్రి కొప్పులఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 బొగ్గు గని పై కప్పు కూలింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటన పై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు  మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

Updated Date - 2021-11-11T00:42:35+05:30 IST