మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరు -మంత్రి కొప్పుల ఈశ్వర్

ABN , First Publish Date - 2022-05-02T23:01:22+05:30 IST

మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరని ఎస్సీ, మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరు -మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరని ఎస్సీ, మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారని, శాంతి భద్రతలు వర్థిల్లుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమ పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన ఈ పవిత్ర నెలంతా కూడా భక్తిశ్రద్ధలతోఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్నారని తెలిపారు.ఓర్పు,సహనం,ఐకమత్యం,దయ, దాతృత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను ఈ పవిత్ర మాసం నేర్పిందన్నారు.


మైనారిటీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నరని మంత్రి పేర్కొన్నారు.మైనారిటీల సంక్షేమం, సముద్ధరణకు కేసిఆర్ ప్రభుత్వం ఈ 8 ఏండ్లలో 11వేల 610కోట్లు ఖర్చు చేసిందని అన్నారు.మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులిస్తున్నమని మంత్రి తెలిపారు. తెలంగాణలో 204 గురుకులాల ద్వారా మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

Read more