అంబేడ్కర్ చూపిన బాటలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు: కొప్పుల

ABN , First Publish Date - 2022-04-14T21:01:37+05:30 IST

గొప్ప విద్యావేత్త,తత్వవేత్త, రాజనీతిజ్ఞులు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి మనమందరం ఘన నివాళలర్పించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు

అంబేడ్కర్ చూపిన బాటలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు: కొప్పుల

హైదరాబాద్: గొప్ప విద్యావేత్త,తత్వవేత్త, రాజనీతిజ్ఞులు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ప్రతి ఒక్కరూ ఘన నివాళలర్పించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.స్వాతంత్ర్య సమర యోధుడిగా, న్యాయవాదిగా, రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక విప్లవ కారుడిగా తాడిత,పీడిత వర్గాలకు, దేశానికి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం అన్నారు.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని మంత్రి కొప్పుల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఆ మహనీయుడు చూపిన బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం,సముద్ధరణకు చిత్తశుద్ధితో కేసీఆర్ కృషి చేస్తున్నరని పేర్కొన్నారు.ఇందులో భాగంగానే పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించి సమాజంలోని వారందరిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని,దళితబంధు ద్వారా ఎస్సీ జీవితాలలో వెలుగులు నింపుతున్నారని వివరించారు.అంబేడ్కర్ రచనల్ని అధ్యయనం చేయడం ద్వారా స్ఫూర్తినొంది విద్యావంతులై ఉన్నత ఉద్యోగులుగా తెలంగాణ సమాజానికి, దేశానికి అమూల్యమైన సేవలందించాల్సిందిగా మంత్రి కొప్పుల యువతను కోరారు.


Updated Date - 2022-04-14T21:01:37+05:30 IST