అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ -మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2022-04-04T22:24:22+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అన్ని రంగాల అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని ఎస్సీ,మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ -మంత్రి కొప్పుల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అన్ని రంగాల అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని ఎస్సీ,మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ పోస్టర్స్,బ్రోచర్స్ ను మంత్రి కొప్పులఈశ్వర్ ఆవిష్కరించారు.  జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కొప్పుల శుభాకాంక్షలు తెలిపారు.ఎంపిగా, కేంద్ర మంత్రిగా,ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ఛైర్మన్లు రావుల విజయ్ కుమార్,నాగారం బాబు మాదిగ,వైస్ ఛైర్మన్లు ఏర్పుల యాదయ్య,తూర్పాటి హన్మంతు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 


ఈసందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి దిక్సూచిగా మారిందన్నారు. గతేడాది ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం 67వేల787కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 93వేల489కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వెయ్యి గురుకులాల ద్వారా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.ఐటి,ఫార్మా,రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్,ఏరోస్పేస్ రంగాలు మరింత దూసుకుపోతున్నాయన్నారు.తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. 

Updated Date - 2022-04-04T22:24:22+05:30 IST