మంచి సహచర మిత్రుడుని కోల్పోయా: మంత్రి Kodali

ABN , First Publish Date - 2022-02-21T16:41:11+05:30 IST

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కొడాలి నాని అన్నారు.

మంచి సహచర మిత్రుడుని కోల్పోయా: మంత్రి Kodali

విజయవాడ: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కొడాలి నాని అన్నారు. మంచి సహచర మిత్రుడిని కోల్పయానని ఆవేదన చెందారు. చిన్న వయస్సులోనే మృతి చెందటం బాధాకరమన్నారు. గౌతం రెడ్డి మృతి పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. గౌతమ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలా జరగటం బాధాకరమని తెలిపారు. గౌతమ్ రెడ్టి అందరితోనూ కలిసిపోయి అప్యాయంగా పలకరించే వారని గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి కొడాలి నాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2022-02-21T16:41:11+05:30 IST