వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-27T03:42:59+05:30 IST

వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు తమ్ముడిలాంటి వారని ఆయన చెప్పారు. తాను వైసీపీలో ఉన్నానని..

వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

కృష్ణా: వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు తమ్ముడిలాంటి వారని ఆయన చెప్పారు. తాను వైసీపీలో ఉన్నానని, రాధ టీడీపీలో ఉన్నాడనుకుంటా? అని వ్యాఖ్యానించారు. ‘‘ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నాయకులు చెప్పినా పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారు. బంగారం లాంటి రాధా, తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేది. రాగి కలిపితేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుంది. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడు.’’ అని మంత్రి కొడాలి నాని  అన్నారు. 

Updated Date - 2021-12-27T03:42:59+05:30 IST