జగన్ రాజీనామా చేయమన్నారు.. చేశాం: కొడాలి నాని

ABN , First Publish Date - 2022-04-07T23:06:48+05:30 IST

అమరావతి: మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తాను మాత్రం జగన్ కోసం... పార్టీ కోసం పని చేస్తానని కొడాలి నాని అన్నారు. 11న కేబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ చెప్పినట్లు నాని తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేవాళ్లకు అవకాశం ఇస్తామని జగన్ చెప్పారని నాని తెలిపారు. కేబినెట్‌లో కొంతమంది కంటిన్యూ అవుతారని జగన్ తమకు చెప్పినట్లు పేర్కొన్నారు. జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవులుంటాయని చెప్పారు. రాజీనామాల లేఖపై సంతకాలు చేశామని నాని పేర్కొన్నారు. కాగా ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. గవర్నర్ హరిచందన్‌కు మంత్రులు రాజీనామాలు సమర్పించనున్నారు. ఈ రాత్రికే వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు. ఈ మేరకు మంత్రులు తమ రాజీనామాలను గవర్నర్‌కు పంపనున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ..

జగన్ రాజీనామా చేయమన్నారు.. చేశాం: కొడాలి నాని

అమరావతి: మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తాను మాత్రం జగన్ కోసం... పార్టీ కోసం పని చేస్తానని కొడాలి నాని అన్నారు. 11న కేబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ చెప్పినట్లు నాని తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేవాళ్లకు అవకాశం ఇస్తామని జగన్ చెప్పారని కొడాలి పేర్కొన్నారు.  ఐదారుగురు కేబినెట్‌లో కంటిన్యూ అవుతారని సీఎం తమకు చెప్పినట్లు చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవులుంటాయని తెలిపారు. రాజీనామాల లేఖపై సంతకాలు చేయమని జగన్ చెప్పారని,.. తామందరం చేశామని నాని స్పష్టంచేశారు. 


కాగా ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ హరిచందన్‌కు పంపనున్నారు. ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించనున్నారు. 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 


Updated Date - 2022-04-07T23:06:48+05:30 IST