Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Apr 2022 16:18:47 IST

ఎన్టీఆర్ స్టేడియంలో ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ ’ ప్రారంభం

twitter-iconwatsapp-iconfb-icon
ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్  ప్రారంభం

హైదరాబాద్: భారత స్వాతంత్ర్య సమర యోధులు ముఖ్యంగా, ప్ర త్యేకించి అంతగా ప్రచారం పొందని వీరులు చేసిన త్యాగాలను స్మరించుకొని యువతరానికి స్ఫూర్తిని అందించడం కోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమర యోధులపై ప్రత్యేక ఫోటో ప్రదర్శన నగరంలోని ఎస్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. శుక్రవారం నుంచి మూడవ తేదీ వరకు ఈ ప్రదర్శన వుంటుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ వో బి) తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల పై  ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. 


బ్రిటీష్ పాలనకు, అప్పటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రను ఈ ఎగ్జిబిషన్ ప్రదానంగా వివరిస్తుంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడటంలో కుమురం భీం వంటి అంతగా వెలుగు లోకి రాని అసామాన్య వీరుల పాత్రను కేంద్ర మంత్రి గవర్నర్ కు వివరించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ వంటి ఇతివృత్తాలతో సహా సుమారు 50 ప్యానెల్స్ ను ఎగ్జిబిషన్ లో ఉంచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిష న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భార త దేశానికి స్వాతంత్ర్యం వ చ్చి 75 సంవ త్స రాలు పూర్తయిన సంద ర్భంగా, మన స్వాతంత్ర్య సమర యోధులు, ప్ర త్యేకించి అంతగా ప్రచారం పొందని వీరులు చేసిన త్యాగాలను స్మరించుకొని యువతరానికి స్ఫూర్తిని అందించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగ పడుతుందన్నారు. 


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమర యోధులపై ప్రదర్శనలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఈ సాయంత్రం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానున్న మూడు రోజుల సాంస్కృతిక ఉత్సవంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి సుమారు 1000 మంది కళాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.