ఆక్రమణ డ్రెయిన్ల తొలగింపునకు చర్యలు

ABN , First Publish Date - 2020-10-19T05:54:28+05:30 IST

ఆక్రమణలకు గురైన డ్రెయిన్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం

ఆక్రమణ డ్రెయిన్ల తొలగింపునకు చర్యలు
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

మంత్రి కురసాల కన్నబాబు
సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 18: ఆక్రమణలకు గురైన డ్రెయిన్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కాకినాడ రూరల్‌ మండలం తమ్మవరంలో వరద ముంపుబారిన పడిన పంటపొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలు, ఎగువ ప్రాంతాలు, ఏలేరు నుంచి వస్తున్న వరద నీటితో జిల్లా అంతటా పంటలు దెబ్బతిన్నాయన్నారు. డ్రెయిన్లు ఆక్రమణ కు గురవ్వడంతో నీరు ముందుకెళ్లే అవకాశం లేక కాలనీలు, పంటపొలాల్లోకి వరద నీరు వచ్చిందన్నారు. డ్రెయిన్ల ఆక్రమ ణ, పంట నష్టం అంచనా తదితర విషయాలపై సోమవారం జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తమ్మవరరంలో ఇండసీ్ట్రయల్‌ ఎస్టేట్‌లో కంపెనీ వాళ్లే డ్రెయిన్లు ఆక్రమించుకోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం తమకు ఇవ్వాలన్న రైతుల అభ్యర్థన మేరకు మంత్రి స్పందిస్తూ 1996 ఎక్విజేషన్‌కు వెళ్లిన భూములకు నష్టపరిహారం విషయమై చర్చించి న్యాయం చేస్తామని హామీఇచ్చా రు. వ్యవసాయశాఖ ఏడీ జిపద్మశ్రీ, తహశీల్దార్‌ వేముల మురళీకృష్ణ, ఏవో సురే్‌షకుమార్‌, కార్యదర్శి వీరబాబు, వైసీపీ నాయకులు నురుకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T05:54:28+05:30 IST