బాలిక కుటుంబానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-10-19T05:59:36+05:30 IST

రాజవొమ్మంగి మండలం యర్రంపాడులో అత్యాచారా నికి గురైన బాలిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కన్నబాబు హామిఇచ్చారు.

బాలిక కుటుంబానికి అండగా ఉంటాం
అధికారులతో చర్చిస్తున్న మంత్రి, ఎంపీ

మంత్రి కన్నబాబు
జీజీహెచ్‌ (కాకినాడ)/రాజవొమ్మంగి, అక్టోబరు 18: రాజవొమ్మంగి మండలం యర్రంపాడులో అత్యాచారా నికి గురైన బాలిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కన్నబాబు హామిఇచ్చారు. కాకినాడ జీజీహెచ్‌ దిశ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఆదివారం మంత్రి, ఎంపీ వంగా గీత, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌ అనంతబాబు పరామర్శించారు. బాలిక కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ దురాగతానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాలిక తల్లికి అంగన్‌వాడీ కార్యకర్తగా ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంరాఘవేంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T05:59:36+05:30 IST