కొబ్బరి ఉత్పాదనలో ఏపీ ప్రథమం: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2020-09-19T09:05:16+05:30 IST

కొబ్బరి ఉత్పాదనలో ఏపీ ప్రథమం: మంత్రి కన్నబాబు

కొబ్బరి ఉత్పాదనలో ఏపీ ప్రథమం: మంత్రి కన్నబాబు


అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కొబ్బరి ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా, కొబ్బరి ఉత్పాదనలో ప్రథమ స్థానంలో నిలిచింద ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ 2020-21ను కొబ్బరి నామ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం అంబాజీపేట కొబ్బరి పరిశోధన స్థానం నిర్వహించిన వెబ్‌నార్‌లో మాట్లాడారు.  కాగా, రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచి, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.  


ఉద్యాన విద్యార్థుల ఉపకార వేతనాల పెంపు

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు పెంచింది. పీహెచ్‌డీ హార్టికల్చర్‌ విద్యార్థులకు నెలకు  రూ.10వేలకు, ఎమ్మెస్సీ హార్టికల్చర్‌(పీజీ)కు రూ.7వేలకు పెంచారు. కాగా, రాష్ట్రంలో ఎరువుల బఫర్‌ స్టాక్స్‌కు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారానే ఎరువుల సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

Updated Date - 2020-09-19T09:05:16+05:30 IST