నెల్లూరు: మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇస్కాన్ సిటీలోని అనిల్ ఇంటికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వచ్చారు. మంత్రి కాకాణిని ఎమ్మెల్యే అనిల్ సాదరంగా ఆహ్వానించారు. కొంతకాలంగా అనిల్, కాకాణి మధ్య వర్గవిభేదాలు ఉన్నాయి. ఇటీవల పరిణామాలతో ఇరువురి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ిఇటీవల సీఎం జగన్ ఈ ఇద్దరి నేతల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సూచన మేరకే మంత్రి కాకాణి, ఎమ్మెల్యే అనిల్ సమావేశం అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి