- Home Minister ఆరగ జ్ఞానేంద్ర
బెంగళూరు: మతమార్పిడి నిషేధ ఆర్డినెన్స్ ఒక నిర్దిష్ట మతాన్ని ఉద్దేశించింది కాదని, బలవంతంగా మతమార్పిడులకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకేనని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు. బెంగళూరులోని తన నివాసంలో నగర నూతన పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మతమార్పిడి నిషేధ బిల్లును పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాలను ఆదేశించామన్నారు. బెళగావి శాసనసభ స మావేశాల్లోనే మతమార్పిడి నిషేధ బిల్లు ఆమోదం పొందినప్పటికీ విధానపరిషత్‌లో మాత్రం ఆమోదం పొందలేదన్నారు. వచ్చే సమావేశాల్లో పరిషత్‌లోనూ ఈ బిల్లుకు ఆమోదముద్ర ఖాయమన్నారు. బలవంతపు మతమార్పిడుల కారణంగానే సమాజంలో శాంతిసామరస్యాలు దెబ్బతింటున్నాయన్నారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ అనవసరంగా ఈ అంశంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి