బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-10-03T09:44:39+05:30 IST

మునుగోడు నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్ల నమ్మకాన్ని, అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వలాభం కోసం రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు.

బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి

ఉప ఎన్నిక ఎందుకో చెప్పాలి: మంత్రి జగదీశ్‌ రెడ్డి


చండూరురూరల్‌, అక్టోబరు2: మునుగోడు నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్ల నమ్మకాన్ని, అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వలాభం కోసం రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని విద్యుత్‌శాఖ మంత్రి  జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. బ్రిటీష్‌ వారికి, నిజాం రజాకార్లకు భూస్వాములు కోవర్టులుగా మారి దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్లు మునుగోడు ప్రాంత ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి బీజీపీకి తాకట్టు పెట్టారని మంత్రి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ప్రాంతానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్‌ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, అన్ని రంగాల్లో దేశంలో తొలిస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రానున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించి ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలన్నారు.

Updated Date - 2022-10-03T09:44:39+05:30 IST