లక్ష్మీనృసింహుడి సేవలో మంత్రి జగదీ్‌షరెడ్డి

ABN , First Publish Date - 2022-08-16T06:31:49+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. పెళ్లిరోజును పురస్కరించుకొని తన సతీమణి సునీతతో కలిసి క్షేత్ర సందర్శనకు విచ్చేసిన వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని మూలమూర్తులను, కవచమూర్తులను దర్శించుకుకోగా, అర్చకులు హారతిని అందజేశారు.

లక్ష్మీనృసింహుడి సేవలో మంత్రి జగదీ్‌షరెడ్డి
మంత్రి జగదీ్‌షరెడ్డి దంపతులకు స్వామివారి శేషవస్త్రాలు అందజేస్తున్న గుట్ట ఈవో గీతారెడ్డి

యాదగిరిగుట్ట, ఆగస్టు 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. పెళ్లిరోజును పురస్కరించుకొని తన సతీమణి సునీతతో కలిసి క్షేత్ర సందర్శనకు విచ్చేసిన వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని మూలమూర్తులను, కవచమూర్తులను దర్శించుకుకోగా, అర్చకులు హారతిని అందజేశారు. ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గన్నారు. అనంతరం ఆలయ అష్టభుజి ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారి కోటి కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నా రు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం జరిపగా, దేవస్థాన ఈవో గీతారెడ్డి స్వామివారి శేషవస్త్రాలను, అభిషేకం లడ్డూ ప్రసాదాలు అందజేశారు. మంత్రి  వెంట ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-08-16T06:31:49+05:30 IST