సూర్యాపేట: తెలంగాణా(Telangana)లో బీజేపీ డబల్ ఇంజన్ వస్తే ప్రజలకు మద్దెల దరువే అని మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish reddy) వ్యాఖ్యలు చేశారు. నిన్నటి బీజేపీ, మోదీ సభ అంశాలపై మంత్రి మాట్లాడుతూ... ప్రధాని మోదీ(Modi) తెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారని మండిపడ్డారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని భయపడ్డారన్నారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణాకు తక్కువ నిధులు ఇచ్చారని అన్నారు. టెక్స్టైల్ పార్క్ ఎప్పుడో రావలసి ఉందని, ఇప్పటికీ వచ్చేంత వరకు నమ్మలేమని తెలిపారు. దేశ ప్రజలు నూతన అజెండా కోసం ఎదురు చూస్తున్నారని కేసీఆర్ (KCR) అన్నందుకే హైదరాబాద్ బీజేపీ నేతలు వచ్చారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన నూతన అజెండా అంశం చర్చనీయాంశంగా మారుతుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి