సూర్యాపేట: దేశ రక్షణలో యువత ముందుండాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ బాబు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సంతోష్ బాబు స్పూర్తితో సూర్యాపేట పతాక శీర్షికలకెక్కిందన్నారు. సూర్యాపేటలో ప్రీ రిక్రూట్‌మెంట్ జరగడం అభినందనీయమని తెలిపారు. సిపాయి నుండి ఉన్నతాధికారి వరకు ఎంపిక ఇకపై సూర్యాపేటలోనే జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి రెండు నెలల శిక్షణ, శిక్షణ కాలంలో భోజనాది సౌకర్యాలు వ్యక్తిగతంగా భరిస్తానని మంత్రి జగదీష్ వెల్లడించారు.