Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల కోసం ఓ రైతు పక్షపాతిగా తీసిన చిత్రం ‘రైతన్న’: Jagadish reddy

సూర్యాపేట: సూర్యాపేటలోని ఈశ్వర్ మూవీ మహల్‌లో ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వం వహించి నటించిన రైతన్న సినిమాను  మంత్రి జగదీష్ రెడ్డి తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనం, రైతుల కోసం ఓ రైతు పక్షపాతిగా తీసిన చిత్రం ‘రైతన్న’ అని తెలిపారు. కొత్త రైతు చట్టాల వల్ల రాబోయే లాభ నష్టాలను ఈ సినిమా ద్వారా చూపించిన విధానం భేష్ అని మెచ్చుకున్నారు. అన్నదాత బాధలకు పరిష్కారం చూపేలా రైతన్న సినిమాను ప్రతీ ఒక్కరు ఆదరించాలని కోరారు. .రైతన్న సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు అరుదుగా వస్తుంటాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement