Abn logo
Mar 26 2020 @ 17:30PM

స్క్రీనింగ్ తరువాతే అనుమతి.. ఈ రోజు రాత్రి వరకే ఆ సడలింపు: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: దామరచర్ల మండలం వాడపల్లి బార్డర్ చెక్ పోస్టు‌ను మంత్రి జగదీష్‌రెడ్డి సందర్శించిన మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద కలుగుతున్న ఇబ్బందులపై ఇరు సీఎంలు చర్చించారన్నారు. 


ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి కొన్ని షరతులు పెట్టారని తెలిపారు. ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ పరీక్ష చేసిన తరువాతే ఏపీలోకి అనుమతి ఇస్తారని వెల్లడించారు. ఈ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement