నల్గొండ జిల్లాలో వ్యాక్సినేషన్‌పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2022-01-19T23:57:49+05:30 IST

జిల్లాలో మొదటి దశ వ్యాక్సినేషన్ 99.83 శాతం పూర్తయిందని

నల్గొండ జిల్లాలో వ్యాక్సినేషన్‌పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

నల్గొండ: జిల్లాలో మొదటి దశ వ్యాక్సినేషన్ 99.83 శాతం పూర్తయిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.  జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో కోవిడ్, ఒమిక్రాన్, వ్యాక్సినేషన్‌పై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చికిత్సలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్ 70 శాతానికి చేరుకున్నదన్నారు.15 నుంచి 17 సంవత్సరాల యువతకు 61.42 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మారుమూల ప్రాంతాలలోనూ వ్యాక్సినేషన్‌ను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-19T23:57:49+05:30 IST