Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 30 2021 @ 15:02PM

జానారెడ్డి తిరస్కరించబడ్డారు: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: మంచి మెజార్టీతో  నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిడమనూరులో మంత్రి జగదీష్‌రెడ్డి  మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో.. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఆకలి చావులపై విజయం సాధించామన్నారు. 2018లోనే జానారెడ్డి ప్రజలచేత తిరస్కరించబడ్డారని తెలిపారు. సీఎం కేసీఆర్ మాకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారన్నారు.చెప్పడానికి ఏమీ లేక జానారెడ్డి ఓటమిని అంగీకరించి ప్రచారానికి పోవద్దని చెబుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement