నియంత్రిత సాగులో రైతులు భాగస్వాములు కావాలి- మంత్రి జగదీశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-03T20:39:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిపెట్టుకునే నియంత్రిత సాగును ప్రయోగాత్మకంగా అమలుచేస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీఽశ్‌రెడ్డి అన్నారు.

నియంత్రిత సాగులో రైతులు భాగస్వాములు కావాలి- మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిపెట్టుకునే నియంత్రిత సాగును ప్రయోగాత్మకంగా అమలుచేస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీఽశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా నియంత్రిత సాగులో రైతులు భాగస్వాములు కావాలని అన్నారు. పంటల మార్పిడితో పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కందికి రందిలేదు. సోయాబీన్‌కు మంచి డిమాండ్‌ వుంది. దీని వల్ల రైతులు మరింత లాభాలుపొందడానికి నియంత్రిత సాగు ఎంతోసానుకూలమని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించడమేకాకుండా తద్వారా వచ్చే మంచి లాభాలను కూడా వారికి వివరిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు నియంత్రిత సాగు పట్ల మొగ్గుచూపుతున్నారు. 


ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో రైతులను కలిసి ముఖాముఖి మాట్లాడుతున్నారు. పామాయిల్‌ వంటి పంటల వైపు రైతులు దృష్టిసారిస్తే అదుకు అనుగుణంగా ఆయిల్‌ తయారు చేసే కార్మాగారం పెట్టించడం సులభమేనని కూడా మంత్రి జగదీశ్‌ వారికి వవరిస్తున్నారు. లాభదాయక పంటలు ఏ  విధంగా పండించవచ్చో ఉదాహరణలతో సహా వివరించారు. పంటల డిమాండ్‌ను బట్టి మార్కెట్‌ లు కల్లాల దగ్గరికి వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం కూడా అదేనని, అందుకు రైతులను సంఘటితం చేసేందుకే ఇలాంటి అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్టు మంత్రి వివరించారు. ఈ వానాకాలంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని, మరో 15 రోజుల్లో నీరు విడుదల ఉంటుందన్నారు. 

Updated Date - 2020-06-03T20:39:42+05:30 IST