రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేత కాదు.. టీటీడీపీ కోవర్ట్: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-16T21:38:08+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేత కాదు.. టీటీడీపీ కోవర్ట్: జగదీష్‌రెడ్డి

నల్గొండ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను రేవంత్‌రెడ్డిహేళన చేసి మాట్లాడడం దుర్మార్గమన్నారు. అసలు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతే కాదని.. టీటీడీపీ కోవర్ట్ అని ఆయన ధ్వజమెత్తారు. సంస్కార హీనుడిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఉద్యమంలో కుట్రలు చేసినోళ్లకు మూటలు మోసిన చరిత్ర రేవంత్‌ది అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకే రేవంత్ పార్టీలో చేరారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారని ఆయన అన్నారు.  


Updated Date - 2022-02-16T21:38:08+05:30 IST