సొంతగడ్డపై ప్రేమతోనే పుస్తక రచన

ABN , First Publish Date - 2020-10-23T10:49:00+05:30 IST

మండ లంలోని రేకొండలో పుట్టిన చాడ వెంకటరెడ్డి తన సొంత గడ్డపై ఉన్న ప్రేమతో రేకొండ సామాజిక చైతన్యం-గ్రామీణ స్థితిగతులు అనే పుస్తకాన్ని రచించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

సొంతగడ్డపై ప్రేమతోనే పుస్తక రచన

మంత్రి ఈటల రాజేందర్‌


చిగురుమామిడి, అక్టోబరు 22: మండ లంలోని రేకొండలో పుట్టిన చాడ వెంకటరెడ్డి తన సొంత గడ్డపై ఉన్న ప్రేమతో రేకొండ సామాజిక చైతన్యం-గ్రామీణ స్థితిగతులు అనే పుస్తకాన్ని రచించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం రేకొండ  జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో మాజీ ఎ మ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రచించిన రేకొండ సామాజిక చైతన్యం-గ్రామీణ స్థితిగతులు అనే పుస్తకాన్ని ఆయన ఆవి ష్కరించారు. రేకొండ పై చాడ వెంకటరెడ్డి రచనలో వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన పాటల సీడీని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ శశాంక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ రే కొండ చైతన్యవంతమైన గ్రామమన్నారు.


గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పుస్తక రచయిత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడు తూ రేకొండలో పుట్టిన తనను సర్పంచ్‌గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో గ్రామంపై పుస్తకం రా యాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. పుస్తకం వెలువ డడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ కొత్త వినీత,  జడ్పీటీసీ గీకురు రవీందర్‌, సర్పంచ్‌ రజిత, ఎంపీటీసీలు కొత్తూరి సంధ్య, చాడ శోభ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T10:49:00+05:30 IST