భగళాముఖి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా శివ్వంపేట

ABN , First Publish Date - 2022-08-15T05:38:01+05:30 IST

భగళాముఖి ఆలయ నిర్మాణంతో మెదక్‌ జిల్లా శివ్వంపేట ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శివ్వంపేటలోని భగళాముఖి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన లక్ష హరిద్రార్చన కార్యక్రమానికి ఆయన సతీసమేతంగా హాజరై పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కలు నాటారు.

భగళాముఖి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా శివ్వంపేట
శివ్వంపేటలోని భగళాముఖి ఆలయం వద్ద లక్ష హరిద్రార్చనలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే తదితరులు

ప్రభుత్వం నుంచి నిధులిప్పించేందుకు కృషిచేస్తా 

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

శివ్వంపేట, ఆగస్టు 14: భగళాముఖి ఆలయ నిర్మాణంతో మెదక్‌ జిల్లా శివ్వంపేట ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శివ్వంపేటలోని భగళాముఖి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన లక్ష హరిద్రార్చన కార్యక్రమానికి ఆయన సతీసమేతంగా హాజరై పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కలు నాటారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ. 1,200 కోట్లతో తీర్చిదిద్దామని వివరించారు. భగళాముఖి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థలదాత రమే్‌షగుప్తా దంపతులు, ఆలయ ఉపాసకులు వెంకటేశ్వరశర్మ, జడ్పీటీసీ మహే్‌షగుప్తా, ఎంపీపీ హరికృష్ణ, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయ అశోక్‌గౌడ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌, హైకోర్టు న్యాయవాది శివకుమార్‌గౌడ్‌, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగరాజు, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ గంగరాం, టీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు రమణాగౌడ్‌, అర్చకులు పురుషోత్తంశర్మ, దేవదత్తశర్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వీఆర్‌ఏలు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేయాలని విన్నవించుకున్నారు.

Updated Date - 2022-08-15T05:38:01+05:30 IST