న్యాయస్ధానాల్లో ఐటీ సేవలు విస్తరిస్తున్నాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-15T02:23:34+05:30 IST

పోక్సో కోర్టుల ఏర్పాటుతో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జరిగేలా చూడడంతో పాటు తెలంగాణ‌లో 36 స్పెష‌ల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

న్యాయస్ధానాల్లో ఐటీ సేవలు విస్తరిస్తున్నాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: పోక్సో కోర్టుల ఏర్పాటుతో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జరిగేలా చూడడంతో పాటు తెలంగాణ‌లో 36 స్పెష‌ల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.న్యాయస్థానాల్లో ఐటీ సేవలను విస్త‌రిస్తున్నామని చెప్పారు.న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం  పెద్ద‌పీట‌ వేసిందన్నారు.తెలంగాణ న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు  న్యాయ‌వాదుల కోసం రూ. 43.48 కోట్లు  వెచ్చించామని తెలిపారు.కరోనా కష్ట కాలంలో న్యాయవాదులకు ఆర్థికంగా ఆదుకున్నామని అన్నారు.న్యాయ‌వాదులు, గుమాస్తాల కోసం  24.71 లక్షల ఆర్థిక స‌హాయం చేయడం, లోక్ అదాలత్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3.35 లక్షల కేసులు పరిష్కరించామన్నారు.


కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనతో పాటు పోస్టుల మంజూరు చేయడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సోమవారం శాసన సభలోరూ.1186.14 కోట్ల అంచ‌నా వ్య‌యంతో న్యాయ‌ శాఖ ప‌ద్దుల‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టారు.ఈ సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన ప్రశ్న‌ల‌కు మంత్రి  వివ‌ర‌ణ ఇచ్చారు.హైద‌రాబాద్ లో ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసి) ఏర్పాటుచేశామన్నారు. ఇది మ‌న‌ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన, ఖచ్చితమైన, సత్వర న్యాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో న్యాయ శాఖ నిబద్ధతతో పని చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం- హైకోర్టు విభజన తర్వాత రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు కోర్టు భవనాల్లో మౌలిక వసతుల కల్పన, పోస్టుల మంజూరుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 


న్యాయస్థానంలో సాంకేతిక పద్ధతిపై సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం తమ వంతు సహకారాన్నిఅందిస్తుందన్నారు.ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసి)హైదరాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. రాయదుర్గంలో  3.7 ఎకరాల స్థలంలో ఈనెల 12న  ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశామని చెప్పారు.హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఐఏఎంసీ అందుబాటులోకి రావడంతోజాతీయ, అంతర్జాతీయ కంపనీలు, సంస్థలు ఇక్కడకు వస్తున్నాయని వివరించారు అన్నిరకాల  వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ హైదరాబాద్ గొప్ప కేంద్రంగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-03-15T02:23:34+05:30 IST