పులుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం: మంత్రి ఇంద్రకరణ్

ABN , First Publish Date - 2021-09-29T20:23:02+05:30 IST

జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపైఉంద‌నిఅట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోలఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

పులుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం: మంత్రి ఇంద్రకరణ్

హైద‌రాబాద్: జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపైఉంద‌నిఅట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోలఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ' (ఎన్టీసీఏ )తో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మీడియాతో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం టైగర్ రిజర్వు సిబ్బందితోనూ, తెలంగాణలో అమ్రాబాద్ నుంచి వచ్చిన వాహనాలు ర్యాలీగా వెళ్లి ప్రచారం చేపట్టాయని తెలిపారు. ఆజాదీ కా అమృత్  మహోత్సవ్- వేడుకల్లో  భాగంగా దేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ లను కలుపుతూ పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ' (ఎన్‌టీసీఏ) ఇండియా ఫర్ టైగర్స్-ఏ ర్యాలీ ఆన్  వీల్స్ ను అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్నిచేప‌ట్టింద‌న్నారు. 


పెద్ద‌ పులుల‌ సంర‌క్షణ‌పై ప్ర‌జ‌ల‌ల్లోఅవ‌గాహ‌నక‌ల్పించ‌డంతో పాటు వారిని భాగ‌స్వామ్యంచేయాల‌నే ఉద్దేశ్యంతో ఎన్టీసీఏ ప్ర‌త్యేకకార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని పేర్కొన్నారు. పులుల ఆవాసాలర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌కుప్ర‌జ‌లమ‌ద్ద‌తుఅవ‌స‌ర‌మ‌ని అన్నారు.  పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పులులను సంరక్షించాల్సిన  అవ‌స‌రంఎంతైనా ఉందన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులే కీలకం కాబట్టి జీవ వైవిధ్యం సమతూకంలో కొనసాగాలంటే అడవుల్లో పెద్ద పులుల సంత‌తి వృద్ధి చేందేలా ర‌క్ష‌ణచ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. పులుల సంర‌క్ష‌ణ, వాటి సంత‌తి వృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వం తో పాటు మ‌న తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకచ‌ర్య‌లు తీసుకుంటుందని వెల్ల‌డించారు. పులుల సంరక్షణ పట్ల తెలంగాణ ప్ర‌భుత్వం అంకితభావంతో ప‌ని చేస్తుందన్నారు. తెలంగాణ‌లోని రెండు టైగ‌ర్రిజ‌ర్వ్ల‌లో పులుల సంఖ్య పెర‌గ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు. పులుల సంరక్షణతోనే అడవుల రక్షణ సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-09-29T20:23:02+05:30 IST