నిర్మ‌ల్ మున్సిపాలిటీలో PHC వ‌ర్క‌ర్ల నియామ‌కానికి బ్రేక్: Indrakaran reddy

ABN , First Publish Date - 2022-05-27T20:20:00+05:30 IST

నిర్మ‌ల్ మున్సిపాలిటీలోప్రాథమిక ఆరోగ్య కేంద్రం( phc) వ‌ర్క‌ర్ల నియామ‌క ప్ర‌క్రియను నిలిపి వేస్తున‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) ప్ర‌క‌టించారు.

నిర్మ‌ల్ మున్సిపాలిటీలో PHC వ‌ర్క‌ర్ల నియామ‌కానికి బ్రేక్: Indrakaran reddy

నిర్మ‌ల్: నిర్మ‌ల్ మున్సిపాలిటీలోప్రాథమిక ఆరోగ్య కేంద్రం( phc) వ‌ర్క‌ర్ల నియామ‌క ప్ర‌క్రియను నిలిపి వేస్తున‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) ప్ర‌క‌టించారు. శుక్రవారం క్యాంప్ ఆపీస్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ నిర్మ‌ల్ మున్సిపాలిటీలో  పీహెచ్సీ వ‌ర్క‌ర్ల నియామ‌కాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగియంటూ గ‌త కొన్ని రోజులుగా  ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి తెలిపారు.దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక స‌మ‌ర్పించాలంటూ క‌లెక్ట‌ర్ కు ఆదేశాలిచ్చిన‌ట్లు చెప్పారు. నివేదిక అందిన వెంట‌నే దాన్ని ప‌రిశీలించి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా అమలుచేస్తుందని మంత్రి తెలిపారు. 

Updated Date - 2022-05-27T20:20:00+05:30 IST