ముస్లింలకు రంజాన్‌ తోఫా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-20T20:40:09+05:30 IST

ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస్తులు, ఇతర సామగ్రిని కానుకగా అందిస్తున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

ముస్లింలకు రంజాన్‌ తోఫా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మ‌ల్: ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస్తులు, ఇతర సామగ్రిని కానుకగా అందిస్తున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని అంబేడ్క‌ర్ భ‌వ‌న్ లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నార‌న్నారు.  


పండుగలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో ఓ వైపు బతుకమ్మ చీరెలు, మరోవైపు క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలు అందజేస్తున్నార‌న్నార‌ని తెలిపారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 3 వేల మందికి తోఫాలు అంద‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ కే. విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి,క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ అలీ, అద‌నపు క‌లెక్ట‌ర్ హేమంత్ బొర్క‌డే, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-20T20:40:09+05:30 IST