పర్యావరణ కాలుష్యం భవిష్యత్‌ తరాలకు ప్రమాదం:ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-02T21:39:38+05:30 IST

పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుందని దీని వల్ల భవిష్యత్‌ తరాలు పెను ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

పర్యావరణ కాలుష్యం భవిష్యత్‌ తరాలకు ప్రమాదం:ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్: పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుందని దీని వల్ల భవిష్యత్‌ తరాలు పెను ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. స‌క‌ల సృష్టికి జీవ‌నాధ‌ర‌మైన గాలి, నీరు, ధ‌రిత్రిని క‌లుషితం చేస్తూ పోతే భ‌విష్య‌త్ అంధ‌కారం అవుతుంద‌ని తెలిపారు. ప్ర‌కృతి వ‌న‌రుల‌ను అనుభ‌విస్తూ ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌ను విస్మరిస్తే జీవుల‌ మనుగడ ప్రశ్నార్థకమ‌వుతుంద‌న్నారు. ఢిల్లీ లాంటి ప్ర‌ధాన‌ న‌గ‌రాలు వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయ‌ని, కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక వ్యూహాల అమలుపై  కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి  పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని  చెప్పారు. 


జాతీయ కాలుష్య నియంత్ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రంలో కాలుష్య నియంత్ర‌ణ‌కు  తెలంగాణ ప్ర‌భుత్వం  తీసుకుంటున్న చ‌ర్య‌లను వివ‌రించారు. అడవులను, పర్యావారణాన్ని రక్షించేందుకు తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి గత కొన్ని సంవత్సరాలుగా కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణ చేపడుతున్నామ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కం ద్వారా చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌, మిష‌న్ భ‌గీర‌థ స్కీం ద్వారా ఇంటింటికి స్వ‌చ్చ‌మైన మంచినీరు అందిండంతో పాటు ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల ద్వారా పచ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌తను ను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.ఈ కార్యక్రమాల్లో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేయేడంతో అనుకున్న‌ ఫ‌లితాల‌ను సాధిస్తున్నామ‌ని తెలిపారు. 

Updated Date - 2021-12-02T21:39:38+05:30 IST