న్యాయవాది విద్యాసాగర్ రెడ్డికి నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-28T20:14:16+05:30 IST

హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.

న్యాయవాది విద్యాసాగర్ రెడ్డికి  నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్: హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి  విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. ప్రియదర్శిని నగర్ - సాగర్ కాలనీలోని ఆయన నివాసంలో  విద్యాసాగర్ రెడ్డి  పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. విద్యాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  వారికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.

Updated Date - 2022-01-28T20:14:16+05:30 IST