ఎల‌క్ష‌న్ల‌కు భ‌య‌పడే మోదీ న‌ల్ల చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకున్నారు

ABN , First Publish Date - 2022-01-09T20:11:53+05:30 IST

రానున్న ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే న‌ల్లా చ‌ట్టాల‌ను మోదీ ప్ర‌భుత్వం వెనక్కి తీసుకుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

ఎల‌క్ష‌న్ల‌కు భ‌య‌పడే మోదీ న‌ల్ల చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకున్నారు

నిర్మ‌ల్: రానున్న ఎన్నిక‌ల్లో ఓట‌మి  భ‌యంతోనే న‌ల్లా చ‌ట్టాల‌ను మోదీ ప్ర‌భుత్వం వెనక్కి తీసుకుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆదివారం దిలావ‌ర్ పూర్, సోన్ మండ‌ల కేంద్రాల్లో  రైతు సంబురాల్లో భాగంగా  రైతులు, నాయకులు  నిర్వ‌హించిన  వేడుక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ర్యాలీలో పాల్గొని ట్రాక్ట‌ర్ న‌డిపారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.మ‌హిళ‌లు వేసిన‌ ముగ్గులను మంత్రి  ప‌రిశీలించారు. 


ఆనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ మాయమాటలు చెబుతూ  మోదీ ప్ర‌భుత్వం రైతులను మోసం చేస్తోందని తెలిపారు. అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉండి బాధ్య‌త‌గా పంట‌ను కొనాల్సిన కేంద్ర కాడి ఎత్తేస్తుందన్నారు.తెలంగాణ రైత‌న్న‌ల‌పై మోదీ ప్ర‌భుత్వం క‌ప‌ట నాట‌కాల‌తో కుట్ర‌ల‌ను చేస్తుందని తెలిపారు. ఓ ప‌క్క‌న వ‌రి ధాన్యం కొన‌మని చెప్పుతూ మ‌రో ప‌క్క వ‌రి సాగు చేయాల‌ని రైతుల‌ను రెచ్చ‌గొట్టి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నార‌ని బీజేపీ నేత‌ల తీరును త‌ప్పు ప‌ట్టారు. బీజేపీ చెప్పే అబద్ధాలను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని రైతులను కోరారు.  


అన్న‌దాత‌ల మేలు కోస‌మే సీయం కేసీఆర్ వరి సాగు చేయ‌వ‌ద్ద‌ని కోరార‌ని, వ‌రి వేసి ఆర్థికంగా వారు న‌ష్ట‌పోవ‌ద్ద‌ని చెప్పుతున్నామ‌న్నారు.  రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సాగు చేయాల‌ని కోరారు.ఇక ఈ మ‌ధ్య  జాతీయ‌ బీజేపీ నాయ‌కులు తెలంగాణ‌కు వ‌చ్చి ఏదేదో మాట్లాడుత‌న్నార‌న్నారు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీయం శివ‌రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత‌ల నోటి దురుసుపై మంత్రి మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నార‌న్నారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీయం అయిన వారా మాకు నీతులు చెప్పేది అని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.

Updated Date - 2022-01-09T20:11:53+05:30 IST