అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళితాభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-14T19:52:53+05:30 IST

భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ అనేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళితాభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళితాభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ అనేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక  ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తున్నారన్నారు.ఇందులో విద్య, ఉపాధికి  ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన సంక్షేమ పథకాలు దళిత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని తెలిపారు. దళితుల్లో అన్నికేటగిరీల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన ఈ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో, రాష్ట్రేతర మేధావుల సైతం ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు.  


సీఎం కేసీఆర్‌ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతు బంధు తరహాలో ప్రతిదళిత కుటుంబానికి ప్రత్యక్షంగా మేలు చేసేలా దళిత బంధు పథకాన్నిప్రవేశపెట్టారన్నారు.దశల వారీగా రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యంగా 2022-23 వార్షిక బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం  ప్ర‌త్య‌క్షంగా 17 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ప‌రోక్షంగా కోటి మందికి ద‌ళిత బంధు ప‌థ‌కం ద్వారా మేలు జ‌ర‌గ‌నుందన్నారు.దీంతోపాటు దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలు, గురుకుల  


సంక్షేమ హాస్టళ్లు, ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌,  ఎస్సీ స్టడీ సర్కిళ్ల కోసం  రాష్ట్ర ప్రభుత్వం  ఏటా కోట్లాది రూపాయలుఖర్చు చేస్తుందని వెల్లడించారు.అంతే కాకుండా  ఎస్సీ గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మార్కెట్ కమిటీ, వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు.నిర్మల్ జిల్లాలోజిల్లాలో  నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి 100 యూనిట్లు, ముధోల్ నియోజ‌క‌వ‌ర్గానికి  100 యూనిట్లు, ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి 61 యూనిట్లకుద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు చేస్తున్నం.నిర్మ‌ల్ జిల్లాలో 261 ఎస్సీ కుంటుంబాల‌కు రూ. 26.10 కోట్లు ఖర్చు చేస్తాంనిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 100  మంది ల‌బ్ధిదారుల‌కు ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున  మొత్తం రూ.10  కోట్ల  ఖర్చు చేస్తున్నామనిమంత్రి వివరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సుమారు రూ.5 కోట్లతో అంబేడ్కర్ భవన్ నిర్మించుకున్నామని, ఈ నెల 18న ఈ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టరు ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టరేట్ హేమంత్ బొర్కడే, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్  అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-14T19:52:53+05:30 IST