Haryana మదర్సాల్లోనూ జాతీయ గీతాలాపన తప్పనిసరి...విద్యాశాఖ మంత్రి వెల్లడి

ABN , First Publish Date - 2022-05-14T13:30:12+05:30 IST

Madrassasలో National Anthem గీతాలాపనపై హర్యానా విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ సంచలన వ్యాఖ్యలు...

Haryana మదర్సాల్లోనూ జాతీయ గీతాలాపన తప్పనిసరి...విద్యాశాఖ మంత్రి వెల్లడి

చండీగఢ్:Madrassasలో National Anthem గీతాలాపనపై హర్యానా విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్యానా  రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేసే అవకాశం ఉందని మంత్రి పాల్ సూచనప్రాయంగా చెప్పారు. ‘‘మదర్సా అయినా లేదా పాఠశాల అయినా జాతీయ గీతాన్ని ప్రతిచోటా ఆలపించాలి. దీనివల్ల ఎలాంటి హాని లేదు.దీనిపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని మంత్రి యూపీ ప్రభుత్వ చర్యపై వ్యాఖ్యానించమని విలేకరులు అడిగినప్పుడు కన్వర్ పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.గురువారం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అన్ని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేశారు. 


ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ బోర్డు రిజిస్ట్రార్‌ మే 9న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌పై పాఠశాలల్లో పాఠాలు ఇంతకుముందు బోధిస్తున్నామని, అది కొనసాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి తెలిపారు.


Read more