స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:15:32+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అటవీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటేలా పదిహేను రోజులపాటు వజ్రోత్సవ వేడుకలను

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
జెండాను అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

వైద్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


ములుగు, ఆగస్టు 9 : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అటవీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటేలా పదిహేను రోజులపాటు వజ్రోత్సవ వేడుకలను జరపాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడానికి 1.20 కోట్ల జెండాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ స్తున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 15 రోజులపాటు వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు (10వ తేదీన) హరితహరం, వన మహోత్సవం, ఫ్రీడంపార్కుల ఏర్పాటు చేయాలని తెలిపారు. 11న ఉదయం 6 గంటలకు నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల భాగస్వామంతో రెండు కిలోమీటర్లు ఫ్రీడం రన్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. 12న రాఖీ పండుగ రోజు అనాథాశ్రమాల్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు రాఖీ వేడుకల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. 13న ఉదయం 10 నుంచి 11 వరకు ఫ్రీడం ర్యాలీలు, 14న సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోమటి చెరువు నెక్లెస్‌ రోడ్డుపై సాంస్కృతిక కార్యక్రమాలు, 15 నిమిషాలు పటాకులు కాల్చడం నిర్వహిస్తామని తెలిపారు. 15వ తేదీన స్వాతంత్య్ర ఉత్సవాలు, స్వాతంత్య్ర సమరయోధులకు  సన్మానం, అధికారులకు అవార్డులు అందజేత ఉంటాయని తెలిపారు. 16న రాష్ట్రవ్యాప్తంగా ఓకే సమయంలో జాతీయ గీతాలపన ఉంటాయని తెలిపారు. 17న బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులు, 18న ఫ్రీడంరన్‌లో విజేతలకు బహుమతులు, 20న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలిసేలా ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌  ప్రతా్‌పరెడ్డి, సిద్దిపేట సీపీ శ్వేత పాల్గొన్నారు.

ప్రతీ ఇంటికి జెండాల పంపిణీ...

వజ్రోత్సవాల సందర్భంగా ప్రతీ ఇంటికి జెండాల పంపిణీని మండల కేంద్రమైన ములుగులో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గ్రామంలో మహిళలకు జాతీయ జెండాలను పంపిణీ చేసి, వజ్రోత్సవాల గురించి వివరించారు. పంద్రాగస్టు రోజు ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, ప్రతీ ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ములుగు పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు జహంగీర్‌, మాదాసు శ్రీనివాస్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ ములుగు పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి, జడ్పీటీసీ జయమ్మ అర్జున్‌గౌడ్‌, ఎంపీపీ లావణ్య అంజన్‌గౌడ్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌, ఎంపీటీసీలు ప్రవీణ్‌, హరిబాబు, సర్పంచ్‌ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:15:32+05:30 IST