మోదీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా: హరీశ్ రావు

ABN , First Publish Date - 2021-08-05T23:32:48+05:30 IST

మోదీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా: హరీశ్ రావు

మోదీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా: హరీశ్ రావు

సిద్దిపేట: హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ దళితుల ఓట్లను చీల్చేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు అయి హుజూరాబాద్‌లో చీకటి ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు. మోడీ బొమ్మను, బీజేపీ జెండాను దాచి ప్రచారం చేస్తున్నారని, బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్‌ ధర రూ.200 దాటిస్తారని హరీశ్  వ్యాఖ్యానించారు. ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. మోదీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా అని, గడియారాలు, కుక్కర్లు పంచడమే ఆత్మగౌరవమా అని హరీశ్ రావు ప్రశ్నించారు. భారతదేశ ఆర్థికవృద్ధి కంటే బంగ్లాదేశ్‌ మెరుగు అని ఎద్దేవా చేశారు. బెంగాల్‌, తమిళనాడులో బీజేపీని బండకేసి కొట్టారని హరీశ్‌రావు విమర్శించారు. 

Updated Date - 2021-08-05T23:32:48+05:30 IST