పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2022-09-23T05:29:38+05:30 IST

పోడుభూముల సమస్యను పరిష్కరిస్తూనే, అడవులకు పునరుజ్జీవం కల్పించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడుభూముల సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడుభూములను సాగు చేసుకుంటూ అటవీ హక్కుపత్రాలు పొందనివారికి న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 22: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తూనే, అడవులకు పునరుజ్జీవం కల్పించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడుభూముల సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడుభూములను సాగు చేసుకుంటూ అటవీ హక్కుపత్రాలు పొందనివారికి న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 85 గ్రామాల్లో 7,740 ఎకరాలకు సంబంధించి 4,503 క్లెయిమ్‌లు స్వీకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చినట్టు తెలిపారు. 4,606 ఎకరాలకు సంబంధించి 2,776 క్లెయిమ్‌లు సకాలంలో వచ్చినా ఆన్‌లైన్‌లో గ్రామాల వివరాలు కనిపించకపోవడంతో పొందుపర్చలేదని తెలియజేశారు. ఇందుకు సంబంధించ సమగ్ర వివరాలు మండలాలవారీగా ఎంపీడీవోలకు అందజేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, అటవీశాఖలను సమన్వయం చేసుకుంటూ ఎంపీడీవోలు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2005 కంటే ముందు నుంచి పోడుభూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, మూడు తరాలు లేదా 75 సంవత్సరాల నుంచి పోడుభూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని సూచించారు. ఆయా స్థాయిల్లో కమిటీల తీర్మానాలను, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం ఎప్పటి నుంచి జరుగుతుందన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు శాటిలైట్‌ మ్యాపుల ఆధారంగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి, ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. సాగు జీవనాధారంగా బతుకుతున్న వారికి పట్టాలివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పోడు భూములు సాగుచేస్తున్నవారికి ఆర్‌వోఆర్‌ పట్టాలు అందించడంతోపాటు ఇకపై అటవీ భూముల అక్రమణలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అడవుల పునరుజ్జీవం, అటవీ రక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, అదనపు ఎస్పీ బాలస్వామి, జిల్లా పరిషత్‌ సీఈవో శైలేష్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీఎ్‌ఫవో రవిప్రసాద్‌, ఆర్డీవో సాయిరాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కేశురాం, డీఎస్పీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-23T05:29:38+05:30 IST