భువనగిరికి మంత్రి హరీ్‌షరావు రేపు రాక

ABN , First Publish Date - 2022-05-19T06:32:48+05:30 IST

వైద్య ఆరో గ్య, ఆర్థికశాఖ మంత్రి హరీ్‌షరావు 20న భువనగిరికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన ఖరారైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లిఖార్జున్‌రావు బుధవా రం తెలిపారు.

భువనగిరికి మంత్రి హరీ్‌షరావు రేపు రాక
ప్రారంభానికి సిద్ధమైన స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌

 డయాగ్నోస్టిక్‌ హబ్‌ ల్యాబ్‌కు శంకుస్థాపన

భువనగిరిటౌన్‌, మే18: వైద్య ఆరో గ్య, ఆర్థికశాఖ మంత్రి హరీ్‌షరావు 20న భువనగిరికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన ఖరారైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లిఖార్జున్‌రావు బుధవా రం తెలిపారు. ఉదయం 11 గంటలకు మంత్రి రానున్నట్లు, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భువనగిరి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేయనున్న డయాగ్నోస్టిక్‌ హబ్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా జిల్లా ఆసుపత్రిలో ఏర్పా టు చేసిన 20 పడకల డెడికేటెడ్‌ పిడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (డీపీఐసీయూ)ను, స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)ను మంత్రి ప్రా రంభించనున్నారు. అలాగే జిల్లాలో సిజేరియన ఆపరే షన్లు తగ్గిస్తూ సాధారణ ప్రసవాలను పెంచే లక్ష్యంతో   సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే మంత్రి ప్రారంభించనున్న పలు భవనా లకు తుది మెరుగులు దిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

Updated Date - 2022-05-19T06:32:48+05:30 IST