మధ్యప్రదేశ్ సీఎంపై మంత్రి Harish rao విమర్శలు

ABN , First Publish Date - 2022-01-08T20:11:27+05:30 IST

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌పై మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

మధ్యప్రదేశ్ సీఎంపై మంత్రి Harish rao విమర్శలు

సిద్దిపేట: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌పై మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.  శివరాజ్‌సింగ్ చౌహాన్ దొడ్డిదారిన సీఎం అయ్యారని అన్నారు. ఏ రంగంలో కూడా మధ్యప్రదేశ్ తెలంగాణకు పోటీ కాదని స్పష్టం చేశారు. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్యప్రదేశ్ కూలీలు ఎందుకుంటారని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో మధ్యప్రదేశ్ ఆదాయం తెలంగాణలో సగం కూడా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఏటీఎంతో పోల్చడం సరికాదని మంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ చేయొద్దనే 317 జీవో రద్దు చేయాలంటున్నారని అన్నారు. ఉద్యోగులకు కేంద్రం 15శాతం ఫిట్‌మెంట్ ఇస్తే... తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందన్నారు. తెలంగాణలో 2.2 శాతం మాత్రమే నిరుద్యోగ రేటు ఉందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-08T20:11:27+05:30 IST