2K Run: సిద్దిపేటలో 2కే రన్‌ను ప్రారంభించిన హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-08-29T15:25:59+05:30 IST

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని సిద్ధిపేట కోమటి చెరువు - నెక్లెస్ రోడ్డున సోమవారం ఉదయం మంత్రి హరీష్ రావు జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు.

2K Run: సిద్దిపేటలో 2కే రన్‌ను ప్రారంభించిన హరీష్‌రావు

సిద్ధిపేట: జాతీయ క్రీడా దినోత్సవాన్ని (National Sports Day) పురస్కరించుకుని జిల్లాలోని సిద్ధిపేట కోమటి చెరువు - నెక్లెస్ రోడ్డున  సోమవారం ఉదయం మంత్రి హరీష్ రావు (Harish rao) జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ... సిద్ధిపేటలో రాబోయే రోజుల్లో అన్నీ స్పోర్ట్స్‌ (Sports)లకు కావాల్సిన వసతుల కల్పన చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యార్థుల (Students)కు విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు స్పోర్ట్స్ అవసరమని తెలిపారు. ఇప్పుడిప్పుడే సమాజం యోగ (Yoga), క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తోందని మంత్రి హరీష్ రావు (Minister harish rao) అన్నారు. 

Updated Date - 2022-08-29T15:25:59+05:30 IST