రేవంత్, బండికి అధ్యక్ష పదవులు రావడానికి కారణం కేసీఆరే : Harish

ABN , First Publish Date - 2021-09-02T17:32:21+05:30 IST

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల అధ్యక్ష పదవులపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్, బండికి అధ్యక్ష పదవులు రావడానికి కారణం కేసీఆరే : Harish

సిద్దిపేట: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల అధ్యక్ష పదవులపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  రేవంత్ పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అన్నారు. గురువారం సిద్దిపేటలోనీ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు.  రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.  ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టీఆర్‌ఎస్ లక్ష్యం కోసం పని చేస్తుందని తెలిపారు. రేపటి నుండి గ్రామ, పట్టణ, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. తాము బ్రతికి ఉండగా నీరు రావన్న ప్రతి పక్షాలకు మల్లన్న సాగర్‌లో పారుతున్న గోదావరి తల్లే సజీవ సాక్ష్యమని మంత్రి హరీష్ రావు పేర్కన్నారు. 

Updated Date - 2021-09-02T17:32:21+05:30 IST