నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం : హరీష్

ABN , First Publish Date - 2020-04-10T18:52:07+05:30 IST

వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.

నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం : హరీష్

సిద్దిపేట జిల్లా : వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. శుక్రవారం నాడు కొమురవెళ్లి మండలంలోని గౌరయ పల్లి, కిష్టంపేట.. కొండపాక మండలంలోని బంధారం, దర్గా గ్రామాల్లో అకాల వడగండ్ల వర్షానికి నేల రాలిన వరి పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఆయనతో పాటు ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకార్, ఆర్డీఓ అనంతరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ ఉన్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట ఇన్సూరెన్స్ ఉన్నవారికి, లేని వారికి కూడా పంట నష్టాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. కొమురవెళ్లి మండలంలో సుమారు 1000 ఎకరాల వరి పంట నష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పంట నష్టాన్ని ప్రతి రైతుకు అందిస్తామన్నారు. రెవెన్యూ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను మొత్తంగా నష్టాన్ని పరిశీలించమని అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి హరీష్ తెలిపారు.





Updated Date - 2020-04-10T18:52:07+05:30 IST