Abn logo
Sep 13 2021 @ 16:27PM

ఈటలది మొసలి కన్నీరు: మంత్రి హరీష్‌రావు

హుజురాబాద్: బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆర్థిక శాఖా మంత్రి  హరీష్‌రావు మండిపడ్డారు. ప్రజలపై ఈటల మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈటలకు సీఎం పదవి తప్ప అన్ని పదవులను టీఆర్ఎస్ కల్పించిందని హరీష్‌రావు తెలిపారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఈటల వ్యవహారం ఉందని హరీష్‌రావు ఆరోపించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల, బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ఈటలను మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. 

క్రైమ్ మరిన్ని...