దళితుల మీద ప్రేమ ఉంటే.. దళిత బంధును దేశవ్యాప్తంగా ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-23T08:21:44+05:30 IST

బీజేపీ నాయకులకు దళితుల మీద ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

దళితుల మీద ప్రేమ ఉంటే.. దళిత బంధును దేశవ్యాప్తంగా ఇవ్వాలి

బీజేపీకి మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌


బెజ్జంకి/గజ్వేల్‌/సిద్దిపేట టౌన్‌, జనవరి 22: బీజేపీ నాయకులకు దళితుల మీద ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే రానున్న బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించేలా కేం ద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి, చిలాపూర్‌, బెజ్జంకి గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, అభివృద్ధి ప నులను ఆయన ప్రారంభించారు.  అనంతరం మాట్లాడు తూ దళితుల సంక్షేమాన్ని కాంక్షించి టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించామ ని, రానున్న బడ్జెట్‌లో దళితబంధుకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేలా సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని స్పష్టం చేశారు. 317 జీవోపై బీజేపీ నాయకు లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు కపట దీక్షలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి బీజే పీ ప్రజలను పీల్చి పిప్పి చేస్తోందని విమర్శించారు. గజ్వేల్‌లో అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలకు యూ నిఫాం పంపిణీని ఆయన ప్రారంభించారు. సిలిండర్‌ ధర రూ.వెయ్యి చేశారని.. ప్రశ్నిస్తే దేశభక్తి కోసం భరించాలని అంటున్నారని మండిపడ్డారు.


ఏం అవ్వా.. టీకా తీసుకున్నావా?

‘ఏం పోశవ్వ బాగున్నవా.. ఆరోగ్యం ఎలా ఉంది.. టీకాలు తీసుకున్నరా..? అంటూ మంత్రి హరీశ్‌రావు ఓ మహిళను ఆత్మీయంగా పలకరించారు. శనివారం సిద్దిపేటలోని 37వ వార్డు అంబేడ్కర్‌నగర్‌లో ఫీవర్‌ సర్వేలో పాల్గొన్న ఆయన ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. వార్డులో మంత్రి పర్యటిస్తుండగా పోశవ్వ అనే మహిళ ఎదురైంది. ‘ఏం పోశవ్వ.. ఎన్ని టీకాలు వేసుకున్నావ్‌’ అని మంత్రి అడిగారు. తాను ఒకటే టీకా వేసుకున్నానని ఆమె చెప్పింది. రెండు వేసుకోవాలని మంత్రి సూచించగా.. భయమవుతున్నది సార్‌ అంటూ బదులిచ్చింది. దీంతో రెండో టీకా వేసుకో, నేనున్నా అంటూ పోశవ్వకు టీకాను వేయించారు. వార్డులో మరో మహిళ అంజమ్మ మాస్క్‌ లేకుండా కనిపించడంతో ఆమెకు మంత్రి మాస్క్‌ను అందజేశారు. ఇలా ఇంటింటికీ తిరుగుతూ జ్వరం ఉందా..? టీకా వేసుకున్నారా..? మాస్క్‌ ధరించాలి.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. 

Updated Date - 2022-01-23T08:21:44+05:30 IST