Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెరుగుతున్న కేసులు.. వైద్యాధికారులతో Harish rao అత్యవసర భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై వైధ్యాధికారులతో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. బి.1.1.259 వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం అలెర్ట్ నేపథ్యంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కరోనా భయం వెంటాడుతోంది.  మేడ్చల్ జిల్లాలోని టెక్‌ మహీంద్రా వర్సిటీలో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. పలువురు విద్యార్థులకు కరోనా రావడంతో యూనివర్సిటీ సెలవులు ప్రకటించింది. 

Advertisement
Advertisement