తెలంగాణలో మొద‌టి డోస్ 100% పూర్తి

ABN , First Publish Date - 2022-01-14T01:11:48+05:30 IST

కొవిడ్ వ్యాక్సినేష‌న్ మొద‌టి డోస్‌ను 100% పూర్తి చేసిన

తెలంగాణలో మొద‌టి డోస్ 100% పూర్తి

హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సినేష‌న్ మొద‌టి డోస్‌ను 100% పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా  తెలంగాణ రికార్డు నెలకొల్పిందని వైద్యఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో తెలిపారు. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ  ఇప్పుడు మ‌రో మైలు రాయిని చేరుకున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ నేటితో 5 కోట్ల డోసులను అధిగ‌మించిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇత‌ర శాఖ‌ల సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకొని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని కరోనా నుండి సంరక్షించుకోవాలని ఆయన కోరారు. 



Updated Date - 2022-01-14T01:11:48+05:30 IST