తెలంగాణపై మరో సారి విషం కక్కారు

ABN , First Publish Date - 2022-05-27T07:55:34+05:30 IST

సిద్దిపేట/హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనలో వరాలు కురిపించాల్సిన ప్రధాని మోదీ మరో సారి కసి తీరా విషం కక్కారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

తెలంగాణపై మరో సారి విషం కక్కారు

మోదీ మాటలన్నీ మోసపూరితమే

నమ్మకానికి టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌

ప్రతిరూపమైతే.. అమ్మకానికి బీజేపీ, 

మోదీ మారు పేరు: హరీశ్‌రావు

మోదీవి మాటలే తప్ప చేతల్లేవు

మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శ

ప్రధాని మోదీ మాటలన్నీ మోసపూరితమే

ఆ పార్టీ తీరు సంజయ్‌ మాటల్లో అర్థమైంది: హరీశ్‌

సిద్దిపేట/హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనలో వరాలు కురిపించాల్సిన ప్రధాని మోదీ మరో సారి కసి తీరా విషం కక్కారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ నాడు పార్లమెంట్‌లో తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన మోదీ.. నేడే అదే తీరులో మోసపూరిత ప్రకటనలు చేశారని విమర్శించారు. అభివృద్ధిలో గుజరాత్‌ను మించిపోతుందనే.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కుటంబ పార్టీ అని మాట్లాడుతున్న మోదీకి.. నాడు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు కోరినప్పుడు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, కశ్మీర్‌ ఎన్నికల సమయంలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. టీఆర్‌ఎ్‌సకు అధికారం ప్రజలిచ్చిందే తప్ప.. వారసత్వంతో వచ్చిందని కాదని అన్నారు. నమ్మకానికి టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ప్రతిరూపమైతే, అమ్మకానికి మోదీ, బీజేపీ మారుపేరని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ మాటల్లోనే ఆ పార్టీ సిద్ధాంతమేంటో అర్థమవుతోందని, ఓట్ల కోసం మతకల్లోలాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీకి ‘‘తెలంగాణ అమరవీరులు’’ అన్న పదాన్ని ఉచ్ఛరించే అర్హతే లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మోదీవి మాటలు తప్ప.. చేతలు కరువయ్యాయని విమర్శించారు. మోదీ మరోసారి అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. విద్యాలయానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం తగదని మోదీని ఉద్దేశించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-05-27T07:55:34+05:30 IST