వాయు, జల కాలుష్యంతో ప్రపంచం తల్లడిల్లుతోంది: మంత్రి హరీశ్

ABN , First Publish Date - 2021-12-20T22:32:27+05:30 IST

ప్రతి విజయం వెనుక ప్రజలే ఉంటారని, ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

వాయు, జల కాలుష్యంతో ప్రపంచం తల్లడిల్లుతోంది: మంత్రి హరీశ్

సిద్దిపేట: ప్రతి విజయం వెనుక ప్రజలే ఉంటారని, ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తడి, పొడి, హానికర చెత్త వేరు చేయడంలో సిద్దిపేట ప్రజల చైతన్యమే ఈ కార్యక్రమాలకు మూలం.ప్రపంచమంతా చెత్త కుప్పలతో వాయు, జల కాలుష్యంతో తల్లడిల్లుతున్నది.చెత్తకుండీలు లేని మున్సిపాలిటీగా మార్చుకున్నాం. రోజు 55 టన్నుల చెత్త వస్తున్నది.  బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా చెత్త కుప్పలు లేని పట్టణంగా మార్చుకుంటున్నాం. తడి చెత్తను ఎరువుగా, గ్యాస్‌గా మార్చు కుంటున్నాం. పొడి చెత్తను రీసైక్లింగ్ కు పంపుతున్నాం. 5 శాతం వస్తున్న హానీకర చెత్తను తగలబెడుతున్నాం. 90 శాతం స్వచ్ఛత సాధించాం.. ఇంకా 10 శాతం స్వచ్ఛతను సాధించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం కావాలి. ఇప్పటికే సిద్దిపేట దేశంలోనే నంబర్ వన్ సస్టైనబుల్ సిటీగా అవార్డు తెచ్చుకున్నాం. చెత్తను మనం ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాం.ఆదాయం ఎంతనే దానికంటే రేపటి తరానికి స్వచ్ఛమైన, కాలుష్య రహిత వాతావరణ సంపదను అందిస్తున్నాం.సిద్దిపేటను ఆరోగ్య సిద్దిపేటగా మార్చుకోవడానికి మనమంతా ముందడుగు వేద్దాం.జాతీయ స్థాయిలో 14, రాష్ట్ర స్థాయిలో 4 ఉత్తమ అవార్డులు సాధించిన ఘనత సిద్దిపేటది అని మంత్రి హరీశ్‌రావు  తెలిపారు. 

Updated Date - 2021-12-20T22:32:27+05:30 IST