29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తి: మంత్రి హరీశ్ రావు

ABN , First Publish Date - 2022-01-28T21:11:44+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ జ్వర సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తి: మంత్రి హరీశ్ రావు

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ జ్వర సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకునేలా వారిని చైతన్యంచేస్తున్నమని చెప్పారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 29 జిల్లాల్లో జ్వర సర్వే పూర్తిచేసినట్టు మంత్రి హరీశ్ రావుస్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో క్యాథ్ లాబ్, ట్రామా కేర్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 77లఓల ఇండ్లలో ఫీవర్ సర్వే పూర్తిచేసినట్టు తెలిపారు. అవసరమైన వారికి మెడికల్ కిట్లను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే కోటి హోంఐసొలేషన్ కిట్లను సిద్ధంగా వుంచామని, మూడో వేవ్ లో 88 దవాఖానాల్లో ఆక్సీజన్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడఅజయ్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T21:11:44+05:30 IST