రాష్ర్టానికి రావాల్సిన రూ.2,638 కోట్ల ఐజీఎస్టీ వెంటనే ఇవ్వాలి- హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-10-02T00:58:14+05:30 IST

తెలంగాణ రాష్ర్టానికి ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు.

రాష్ర్టానికి రావాల్సిన రూ.2,638 కోట్ల ఐజీఎస్టీ వెంటనే ఇవ్వాలి- హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ర్టానికి ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన 25వేల 58కోట్ల  ఐజీఎస్టీ విడుదల చేసేలా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ జీఎస్టీ కౌన్సిల్‌ సిఫారసు చేయాలని అన్నారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డిలో జరిగిన ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈసందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ర్టాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తం పై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ రాష్ర్టానికి ఎంత ఐజీఎస్టీ రావాల్సి ఉందన్నవిషయం పై మాకు స్పష్టత ఉందన్నారు. గతంలో ఈ మొత్తాన్ని 25వేల 58 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్‌లో కాగ్‌ ఎత్తిచూపిన విషయాన్ని ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు.


కాగ్‌సైతం ఈ విషయంలో తప్పుబట్టింది కాబట్టి ఎలాంటి చర్చలేకుండా రాష్ర్టాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఈనెల ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ.్య పన్ను లశాఖ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌, ఆర్ధిక ,వాణిజ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T00:58:14+05:30 IST